తెలుగు బిగ్బాస్(BiggBoss) సీజన్ 7 స్టార్ట్ అయ్యింది.చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ఇక దీంతో మన తెలుగు స్టార్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఆ అవకాశం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)కి వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవటానికి వచ్చిన ఈ హీరోస్ తమదైన స్టైల్లో సందడి చేశారు.
ఇక లేటెస్ట్గా బిగ్బాస్ రిలీజ్ చేసిన ఫన్ విత్ కంటెస్టెంట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. నవీన్ పోలిశెట్టి బిగ్బాస్ హౌస్కి వెళ్లి కంటెస్టెంట్లను ఎంటర్టైన్ చేస్తూ..ఆల్ ది విఐపిస్..ఒకరిపై ఒకరు మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు అంటూ బూస్ట్ ఇచ్చాడు. అలాగే కార్తీకదీపం శోభశెట్టి నవీన్కు షేకండ్ ఇస్తూ..హాయ్! ఐ యామ్ శోభా శెట్టి..యూ నవీన్ శెట్టి అంటూ నవ్వుతూ పలకరించుకున్నారు.
ఇక ఆ తర్వాత మీలో ఎవరు లేడీ లక్ అవ్వబోతున్నారో..వాళ్ళకే లేడీ లక్ బ్యానర్ ఇస్తాను అంటూ నవీన్ టాస్క్ ఇచ్చాడు. లేడీ లక్ అనేది ప్రసెంట్ నవీన్ పోలిశెట్టి నుంచి వస్తోన్న మిస్ శెట్టి మూవీలోని లేడీ లక్ నువ్వే అనే సాంగ్కు సంబంధించినది. ఈ బ్యానర్ను రైతుగా సెలెక్ట్ అయినా పల్లవి ప్రశాంత్..రతిక రోజ్కి ఇస్తాడు..వెంటనే, నాకే ఎందుకు బ్యానర్ ఇవ్వాలనిపించింది అంటూ రతిక అడగ్గా..పల్లవి ప్రశాంత్ స్మైల్ ఇస్తూ..నువ్వు నవ్వకూ అంటూ వీరిద్దరూ మెస్మరైజ్ స్మైల్తో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రిన్స్ యావర్ జిమ్ కసరత్తులు చేస్తుండగా.. హీరో శివాజీ..సామాన్ తీసుకొచ్చి బిగిచ్చినట్టుంది అంటూ పంచ్ వేస్తాడు. దీంతో బిగ్బాస్ హౌస్ అంతా నవ్వులతో షురూ అయ్యింది.