భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2025 బ్యాచ్ ద్వారా 320 నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ : స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200 చెల్లిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. స్టేజ్-I పరీక్ష సెప్టెంబర్లో, స్టేజ్-II నవంబర్, స్టేజ్-III పరీక్ష ఏప్రిల్ లో నిర్వహించనున్నారు. వివరాలకు www.joinindiancoastguard.cdac.in వెబ్సైట్లో సంప్రదించాలి.