కాంగ్రెస్ లీడర్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు కాబోయే కోడలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన కుమారుడు కరణ్ సిద్ధూ నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
కరణ్ సిద్ధూ ఇనాయత్ రంధవాను త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. వీరి నిశ్చితార్థం గంగానది ఒడ్డున కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన సిద్ధూ.. కరణ్ సిద్ధూ తన తల్లి కోరికను నెరవేర్చినట్లు చెప్పారు.
గంగా నది ఒడ్డున కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నట్లు నవజ్యోత్ సిద్ధూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ ఫొటోలలో సిద్దూతో పాటుగా అతని భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ, కుమార్తె రబియా సిద్ధూ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ:ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్యలో రాజకీయాలు లేవు : ఎస్పీ శ్రీథర్
మరోవైపు 10 నెలల జైలు శిక్ష అనంతరం.. ఏప్రిల్ 2, 2023న పాటియాలా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో అతనికి శిక్ష పడింది.నవజ్యోత్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూకి ఇటీవలే స్టేజ్ టూ ఇన్వేసివ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.