
ఐపీఎల్ సీజన్ 18 లో ధనాధన్ బ్యాటింగ్ నడుస్తుంది. బౌలర్లకు చుక్కలు చుక్కలు చూపిస్తూ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. బ్యాటింగ్ పిచ్ లు, బ్యాటర్ల హవాతో ఐపీఎల్ లో బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. భారీ హిట్టింగ్ తో బౌలర్లను బ్యాటర్లు దడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో 300 పరుగులు బాదడం ఖాయంగా కనిపిస్తుంది. పవర్ హిట్టర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పోటీపడి మరీ పరుగుల వరద పారిస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ముగ్గురు టీమిండియా ప్లేయర్ల ఆటపై ప్రశంసలు కురిపించాడు.
శ్రేయాస్ అయ్యర్ , రుతురాజ్ గైక్వాడ్ , అజింక్య రహానే హిట్టింగ్ కు ఫిదా అయిపోయాడు. సిద్ధూ మాట్లాడుతూ.. "వాళ్ళు ఏం తింటున్నారో నాకు తెలియదు. అయ్యర్, రహానే, రుతురాజ్ అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళు ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వాళ్ళ ప్రదర్శన అత్యద్భుతం". మారుతున్న కాలానికి అనుగుణంగా వేరు తమ బ్యాటింగ్ టెక్నీక్ మార్చుకున్నారు". అని ఈ మాజీ ఓపెనర్ అన్నాడు.
Also Read : ఉప్పల్ లో మ్యాచ్.. టాస్ గెలిచిన లక్నో.. సన్ రైజర్స్ బ్యాటింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు సిక్సర్లతో 31 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో అతను ఆడకపోయినా అది పెద్దగా జట్టుపై ప్రభావం చూపలేదు. పంజాబ్ కింగ్స్‌కు తొలిసారి నాయకత్వం వహిస్తున్న శ్రేయాస్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 53 పరుగులు చేశాడు.