ఎలా సాధ్యం బాస్: 5 నెలల్లో.. 35 కేజీల బరువు తగ్గిన మాజీ క్రికెటర్

ఎలా సాధ్యం బాస్: 5 నెలల్లో.. 35 కేజీల బరువు తగ్గిన మాజీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేవలం 5 నెలల వ్యవధిలో 35 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యానికి గురి చేశాడు. కపిల్ శర్మ షో కి ప్రత్యేక అతిథిగా వచ్చిన అతను కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఇటీవల తన భార్య నవజోత్ కౌర్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్‌లోని ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించిన సిద్ధూ.. తాను ఎలా తగ్గాడనే విషయాలను పంచుకున్నాడు. ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆగస్టు నుంచి నేను ఇప్పటివరకు 5 నెలల్లోపు 33 కిలోలు తగ్గాను అని చెప్పాడు. 

"ఎక్కువ దూరం నడవడం.. సరైన ఆహార నియమాలు.. ప్రాణాయామం.. సంకల్ప శక్తి.. ద్వారా సాధ్యమైంది. ప్రయత్నిస్తే అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు". అంటూ రాసుకొచ్చాడు. సిద్ధూ ఆత్మ విశ్వాసానికి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొనియాడాడు. వెల్ డన్ పాజీ అంటూ కామెంట్ చేశాడు. సిద్ధూ ఈ ఫోటో షేర్ చేయగానే 10.9k లైక్స్.. 100 కామెంట్స్ వచ్చాయి. ఒక నెటిజన్ వావ్ అని కామెంట్ చేస్తే.. మరో నెటిజన్స్ సూపర్ సర్ అని ప్రశంసించాడు. ఇంకొక వ్యక్తి మీరు అందరికీ చాలా ఆదర్శం అని చెప్పాడు. 

ALSO READ | Siraj-Mahira: బిగ్ బాస్ బ్యూటీతో సిరాజ్ డేటింగ్.. మహీరా శర్మ తల్లి ఏం చెప్పిందంటే?

1980, 1990 దశకంలో సిద్ధూ టీమిండియాకు ఓపెనింగ్ చేసేవాడు. 1983 లో సిద్ధూ టెస్ట్ క్రికెట్ ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. 1987 ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కెరీర్ లో భారత్ తరపున 51 టెస్టులు, 136 వన్డే మ్యాచ్ లు ఆడాడు. రెండు ఫార్మాట్ లలో కలిపి 7వేలకు పైగా పరుగులు ఉన్నాయి. 1996-97లో వెస్టిండీస్‌పై 201 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.