IPL 2024: సిద్ధూ ఈజ్ బ్యాక్.. కామెంట్రీ బాక్స్ దద్దరిల్లాలి

IPL 2024: సిద్ధూ ఈజ్ బ్యాక్.. కామెంట్రీ బాక్స్ దద్దరిల్లాలి

టీమిండియా మాజీ ఓపెనర్ నవ్​జోత్ సింగ్ సిద్ధూ మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. అదేంటి అతను రిటైర్మెంట్ ప్రకటించాడు కదా మళ్ళీ రావడమేంటి అనుకుంటున్నారా.. నిజానికి సిద్ధూ వస్తుంది మైదానంలో మ్యాచ్ ఆడదానికి కాదు. కామెంట్రీతో అభిమానులకు కిక్ ఇవ్వడానికి. టీమిండియా తరపున గొప్ప ఓపెనర్లలో ఒకడిగా మంచి ఇన్నింగ్స్ లు ఆడిన ఈ పంజాబీ ప్లేయర్..క్రికెట్ తర్వాత  కామెంటేటర్​ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఎంతోమంది ఉన్నా.. హిందీలో ఇతన్ని మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు. 

ఇదిలా ఉంటే మాజీ ఈ పంజాబీ ప్లేయర్ ఐపీఎల్ కు కామెంట్రీ చెప్పేందుకు రెడీ అయిపోయాడు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న  ఐపీఎల్-2024తో కామెంట్రీతో తాను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ లోనే తన మైక్ కు పని చెప్పనున్నాడు.  ఇప్పటికే ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్​కాస్టర్స్ స్పార్ స్పోర్ట్స్ ట్విట్టర్​లో ఓ ప్రకటన ద్వారా గ్రేట్ కామెంటేటర్ సిద్ధూ మళ్లీ వచ్చేస్తున్నాడని వెల్లడించింది.  

ALSO READ :- పరేషాన్ లో మల్లారెడ్డి!.కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేసిందా.?

హిందీ, పంజాబీ భాషల్ని మిక్స్ చేస్తూ ఆయన చేసే కామెంట్రీకి ఫిదా అయిపోవాల్సిందే. క్రికెటర్, కామెంటేటర్ గా విజయవంతంగా తన కెరీర్ ను నెట్టుకొచ్చిన సిద్ధూ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పంజాబ్ రాజకీయాల్లో తనదైన హవా చూపించాడు. చాలా రోజుల తర్వాత తనకు బాగా కలిసి వచ్చిన కామెంటేటర్ గా అలరించడానికి సిద్ధమైపోయాడు