నవోదయ విద్యాలయాల్లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పెంచారు. గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 30తో అప్లికేషన్ గుడువు ముగియనుండగా.. మరో వారం రోజులు పొడిగించారు. దీంతో మే 7 ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500, ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అఫీసియల్ వెబ్సైట్లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రాతపరీక్ష, సర్టిఫికేట్స్ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు.