నవోదయ విద్యాలయాల్లో భారీగా నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అఫీసియల్ వెబ్సైట్లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రాతపరీక్ష, సర్టిఫికేట్స్ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు.