నవరాత్రులు భక్తుల పూజలు అందుకునేందుకు గణనాథులు తరలి వెళ్లారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు ఎక్కడ చూసినా మండపాలకు వెళ్తున్న వినాయక విగ్రహాలే కనిపించాయి. నిర్వాహకులు డప్పు చప్పుళ్లు, బాణా సంచా మోతతో విఘ్ననాథులను తరలించారు. వినాయక చవితి సందర్భంగా పూలు, పండ్లు, స్వీట్లు, పత్రికి గిరాకీ పెరిగింది. మార్కెట్లు, మెయిన్ రోడ్లపై షాపింగ్ సందడి నెలకొంది.
Also Rard: బీసీ, మహిళా బిల్లులపై ఒత్తిడి పెంచుతం: నామా
పాల్వంచలోని కేటీపీఎస్ అంబేద్క ర్ సెంటర్లో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను కేటీపీఎస్ 5, 6, 7 వింగ్స్ చీఫ్ ఇంజనీర్లు మేక ప్రభాకరరావు, పలుకుర్తి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. టౌన్‌లోని నేత్రాలయ కంటి వైద్య కేంద్రం ఆధ్వర్యంలో ఆకుల ఆనంద్, చింతా నాగరాజు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.
- వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్/భద్రాద్రి కొత్తగూడెం/ పాల్వంచ