అమెరికాలో మరో విమాన ప్రమాదం.. కూలిన నేవీ యుద్ద విమానం

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. కూలిన నేవీ యుద్ద విమానం

అమెరికాలలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆకాశంలోనే విమానం, హెలికాప్టర్ ఢీకొనడం.. ఎయిర్ పోర్టులో ఆగివున్న జెట్ విమానాన్ని మరో విమానం ఢీకొనడం.దాదాపు వందమంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన జెట్ విమానం సముద్రంలో కూలిపోయింది.. శాన్ ఢి యాగో హార్బర్  సమీపంలో గురువారం తెల్లవారుజామున అమెరికా మిలటరీ విమానం కూలిపోయింది. అయితే పైలట్లు ఇద్దరు సేఫ్ గా బయటపడ్డారు. 

Also Read :- కొత్త 50 రూపాయలు నోట్లు వస్తున్నాయి.. జాగ్రత్త..!

గురువారం (ఫిబ్రవరి 13) తెల్లవారు జామున షెల్టర్ ఐలాండ్ సమీపంలోని శాన్ డియాగో బేలో US నేవీ EA-18G గ్రోలర్ విమానం కూలిపోయింది. మిలటరీ యుద్ధ విమానం ఈఏ-18జీ గ్రోలర్ ఎలక్ట్రానిక్ ఫైటర్ జెట్.. నార్ ఐలాండ్ నేవల్ ఎయిర్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న షెల్టర్ ఐలాండ్ వద్ద నీటిలో కుప్పకూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఫిషింగ్ ఫిషింగ్ బోటు లో ఉన్న వారు పైలట్లను రక్షించారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు.