వయనాడ్‎లో ప్రియాంక గాంధీ ప్రత్యర్థి ఫిక్స్.. యంగ్ డైనమిక్ లీడర్‎ను బరిలో దించిన బీజేపీ

వయనాడ్‎లో ప్రియాంక గాంధీ ప్రత్యర్థి ఫిక్స్.. యంగ్ డైనమిక్ లీడర్‎ను బరిలో దించిన బీజేపీ

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రియాంక గాంధీపై పోటీకి యంగ్ లీడర్ నవ్య హరిదాస్‌‎ను బీజేపీ బరిలోకి దించింది. ఈ మేరకు కాషాయ పార్టీ ఇవాళ (అక్టోబర్ 19) నవ్య హరిదాస్ పేరును అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. ప్రియాంక గాంధీకి ధీటుగా లేడీ ఫైర్ బ్రాండ్ నవ్యను బరిలోకి బీజేపీ దింపడంతో వయనాడ్ బై పోల్ పోరు రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ ఏడాది (2024) జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‎కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో 2024, అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ బై పోల్ ఎన్నిక జరగనుంది. 

ఈ క్రమంలో తమ సిట్టింగ్ స్థానంతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ సీటు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ ప్రియాంక గాంధీని బరిలోకి దించింది. ఈ క్రమంలోనే వయనాడ్‎లో కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. ప్రియాంక గాంధీని ఢీకొట్టేందుకు యంగ్ డైనమిక్ లీడర్ నవ్య హరిదాస్ ను బరిలోకి దించింది. మరీ హై ప్రొఫైల్  స్థానమైనా వయనాడ్ ఉప ఎన్నికలో ఎవరూ గెలుస్తారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 

నవ్య హరిదాస్ ఎవరంటే..?

ప్రియాంక గాంధీపై పోటీకి బీజేపీ నవ్య హరిదాస్ పేరు ప్రకటించడంతో.. నవ్య పేరు ఒక్కసారిగా మోరుమోగిపోతుంది. ఎవరీ నవ్య హరిదాస్ అని అంతా గూగుల్‎లో సెర్చ్ చేస్తున్నారు. అయితే.. 2007లో బీటెక్ పూర్తి చేసిన నవ్య హరిదాస్ మెకానికల్ ఇంజనీర్‎గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రిజైన్ చేసి.. బీజేపీలో జాయిన్ అయ్యారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే కేరళ బీజేపీలో డైనమిక్ లీడర్‌లలో ఒకరిగా పేరుగాంచారు.

ALSO READ : లెక్క తేలింది: జేఎంఎం, కాంగ్రెస్ సీట్ల షేరింగ్‎పై వీడిన ఉత్కంఠ

2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన నవ్య.. ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్న నవ్య.. కోజికోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌‎గా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నవ్యను బరిలోకి దించుతుండటంతో ఒక్కసారిగా నవ్య లైమ్ లైట్‎లోకి వచ్చారు.