నిమ్స్​ను సందర్శించిన నిజాం ముని మనుమడు

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్​హాస్పిటల్​ను ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముని మనుమడు నవాబ్ నజాఫ్​అలీఖాన్ శుక్రవారం సందర్శించారు. నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా జరుగుతున్న గుండె ఆపరేషన్లను ఆయన పరిశీలించారు. ఏదైనా అవసరమైతే తప్పకుండా చేస్తానని ఆయన హామీనిచ్చారు. అనంతరం నవాబ్ నజాఫ్ అలీఖాన్​ను డాక్టర్లు సన్మానించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న బ్రిటన్​కు చెందిన దన్నపనేని రమణ టీమ్, కార్డియోథొరాసిక్ హెచ్ వోడీ డాక్టర్ అమరేశ్వరరావు ఉన్నారు.