బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీఖి(Nawazuddin Siddiqui)ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే.తన యాక్టింగ్తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాలను ఇట్టే దోచుకుంటాడు.
తాజా విషయానికి వస్తే..నవాజుద్దీన్ సిద్దీఖి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ రౌతు కా రాజ్(Rautu Ka Raaz) రికార్డు క్రియేట్ చేస్తోంది.ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు.ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతూ..మూడు రోజుల్లోనే 10 కోట్ల వాచ్ మినట్స్తో దూసుకెళ్తోంది.
Also Read:సూపర్ హీరోగా నందమూరి వారసుడు.. హనుమాన్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!
గత నెల (జూన్ 28) జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చిన రౌతు కా రాజ్ ఆద్యంతం ఉత్కంఠ రేపే సన్నివేశాలతో,మర్డర్ మిస్టరీతో ప్రేక్షకుల మైండ్ కి బలమైన పనిపెడుతుంది.
స్టోరీ విషయానికి వస్తే..ఓ విశాలమైన మంచు కొండల్లో ఉన్న ఓ చిన్న ఊరు, అందులో అనుమానాస్పదంగా ఓ మహిళ చనిపోవడం..దాన్ని చేధించే క్రమంలో అది దారుణ హత్యగా తేలడం..ఇక ఆపై ఆ హత్యను ఎవరు చేశారన్న ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.ఇంకాస్తా అర్ధమయ్యేలా చెప్పాలంటే..
అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారుతుంది. ఆ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ),ఇన్‌స్పెక్టర్ దిమ్రి (రాజేష్ కుమార్) కలిసి ఈ కేసును ఎలా ఛేదించారు? అసలు ఈ టైటిల్ వెనుకనే సినిమా యొక్క స్టోరీ థీమ్ దాగుంది.రౌతు అంటే ఆ ఊరి పేరు.రాజ్ అంటే రహస్యం.
100Mn+ watch minutes say it all - This raaz is irresistible! 🔥 👀#RautuKaRaaz streaming now, only on #ZEE5#RautuKaRaazOnZEE5 pic.twitter.com/7YMWa4P7YG
— ZEE5 (@ZEE5India) July 1, 2024
రౌతు కా రాజ్ సాధిస్తోన్న సక్సెస్ ను జీ5 ఓటీటీ తనదైన శైలిలో వెల్లడించింది. "స్ట్రీమింగ్ మొదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల వాచ్ మినట్స్ సొంతం చేసుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగా "పది కోట్ల వాచ్ మినట్సే చెబుతున్నాయి..ఈ రహస్యానికి తిరుగులేదని. రౌతు కా రాజ్ మీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది. ఆలస్యం ఎందుకు చూసేయండి.