Nawazuddin Siddiqui: డబ్బులు తీసుకుని పాత్రకు న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నా

Nawazuddin Siddiqui: డబ్బులు తీసుకుని పాత్రకు న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నా

బాలీవుడ్ స్టార్ యాక్టర్ న‌వాజుద్దీన్ సిద్దీఖి (Nawazuddin Siddiqui)ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే.తన యాక్టింగ్తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాలను ఇట్టే దోచుకుంటాడు.: హీరో,విలన్‌,సహాయ నటుడు..ఇలా పాత్ర ఏదైనా సరే తన నటనతో దానికి ప్రాణం పోస్తారు. ఇటీవలే సిద్దీఖి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ రౌతు కా రాజ్ (Rautu Ka Raaz) రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా న‌వాజుద్దీన్ సిద్దీఖి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దక్షిణాది చిత్రాల్లో నటించడంపై స్పందించారు.

‘‘డబ్బు సంపాదించడం కోసం నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. నటనపై ఉన్న ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చా. ఆమేరకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాను. అయితే, ‘రామన్‌రాఘవ్‌’ లాంటి సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై నాకు భిన్నమైన పట్టు ఉంటుందన్నారు". 

ఇకపోతే దక్షిణాది భాషా చిత్రాల్లో నటించినప్పుడు పారితోషకం ఎక్కువగా ఇస్తారనే కారణంతోనే నటిస్తున్నట్లు తెలిపారు.  కాకపోతే, వాళ్లు డబ్బులు ఇస్తున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదన్నారు. పాత్రలపై పూర్తి నియంత్రణ ఉండటం లేదు. దీంతో డబ్బులు తీసుకుని కూడా పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాని ఆయన చెప్పారు.ఇకపోతే దక్షిణాది భాషా చిత్రాల్లో నటించినప్పుడు పారితోషకం ఎక్కువగా ఇస్తారనే కారణంతోనే నటిస్తున్నట్లు తెలిపారు. కాకపోతే, వాళ్లు డబ్బులు ఇస్తున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదన్నారు.

పాత్రలపై పూర్తి నియంత్రణ ఉండటం లేదు. నేను ఏం చేయాలనే దాన్ని చిత్రీకరణ ముందు మరో వ్యక్తి వచ్చి వివరించాల్సి వస్తుంది. దీంతో డబ్బులు తీసుకుని కూడా నన్ను నమ్మి ఇచ్చిన పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాని ఆయన చెప్పారు. రజినీకాంత్ పేట తో పాటు సేక్రెడ్‌ గేమ్స్‌’ తదితర వెబ్‌ సిరీస్‌లతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నవాజుద్దీన్‌.. ఇటీవలే వెంకీ ‘సైంధవ్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో వికాస్‌ మాలిక్‌గా నటించి మెప్పించారు.