
నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్‌లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘కోస్టావో’. నైంటీస్ నాటి గోవాలో జరిగిన స్మగ్లింగ్ దందాలు, క్రైమ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కోస్టావో ఫెర్ణాండేజ్ అనే కస్టమ్స్ ఆఫీసర్ రియల్ లైఫ్ స్టోరీ ఇది. నైంటీస్‌లో ఆయన ఎన్నో హై ప్రొఫైల్ స్మగ్లింగ్ కేసులను విచారించారు. ముఖ్యంగా 1991లో సినీ పక్కీలో ఛేజింగ్ చేసి గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను ఆయన పట్టుకున్నారు. కానీ ఆ ఛేజ్‌లో తన ఆత్మ రక్షణ కోసం చేసిన కాల్పుల్లో అప్పటి గోవా సీఎం సోదరుడు చనిపోవడం సంచలనమైంది.
ఆ మర్డర్ కేసులో సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చగా, సుప్రీం కోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టివేసింది. ఆయన స్ట్రగుల్‌ను, అప్పటి గోవా స్మగ్లింగ్‌ను ఇందులో చూపించబోతున్నారు. ఆ కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నవాజుద్దీన్ నటించాడు. సెజల్ షా దర్శకత్వం వహించాడు. ప్రియా బపత్, కిషోర్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీలోని లీడ్ క్యారెక్టర్స్ లుక్స్‌ను విడుదల చేసిన మేకర్స్.. త్వరలోనే జీ5లో ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.