విడాకులకు దరఖాస్తు చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య

బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య విడాకుల కోసం దాఖలు చేసింది. నవాజుద్దీన్ భార్య అలియా సిద్దిఖీ విడాకులను ఇవ్వడంతో పాటు.. తనకు భరణం కూడా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. కరోనా వల్ల అన్ని సేవలు రద్దవడంతో.. అలియా విడాకులను నోటీసులను మే7న వాట్సాప్ మరియు ఈమెయిల్ ద్వారా పంపించారు.

అలియా తరపు లాయర్ అభయ్ సహయ్ మాట్లాడుతూ.. ‘నా క్లయింట్ మే 7న ఒకసారి నోటీసులు పంపించారు. ఆ తర్వాత మళ్లీ మే 13న కూడా నోటీసులు పంపించారు. కానీ, నవాజుద్దీన్ సిద్దిఖీ వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేం నవాజుద్దీన్ కి 15 రోజుల సమయం ఇచ్చాం. అతను సమాధానం ఇవ్వకపోతే.. కోర్టు తెరవగానే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. అలియా విడాకులతో పాటు తాను జీవించడానికి కావలసిని భరణాన్ని కూడా కోరుతోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ మరియు అతని కుటుంబ సభ్యులపై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం నవాజుద్దీన్ మరియు అతని కుటుంబం లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించినందుకు ముజఫరా నగర్ లో 14 రోజుల క్వారంటైన్ లో ఉన్నారు.