అక్టోబర్ 15న ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం

అక్టోబర్ 15న ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం

అక్టోబర్ 15న హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 10 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పంచకుల జిల్లా కమీషనర్ నేతృత్వం వహించనున్నారు. 

నయాబ్ సింగ్ సైనీ స్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. 

ఖట్టర్‌ను తప్పించి సైనీకి అవకాశం

ఈ ఏడాది మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. రాబోవు ఎన్నికల్లో సైనీ గెలిస్తే అత్యున్నత పదవికి ఎంపిక అవుతారని బిజెపి ఎన్నికల సమయంలో సూచించింది. సైనీ రాష్ట్రంలోని ప్రధాన ఓటు బ్యాంకు అయిన వెనుకబడిన తరగతుల (OBCలు) నుండి వచ్చారు.