బంగారు తెలంగాణను మద్యం రాష్ట్రంగా మార్చిండు : రాజేశ్​పవార్​

  •     నయాగావ్​ ఎమ్మెల్యే రాజేశ్ పవార్​

నెట్​వర్క్, వెలుగు : సీఎం కేసీఆర్ మరో సారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని మహారాష్ట్రలోని నయాగావ్​ ఎమ్మెల్యే రాజేశ్​పవార్​ఆరోపించారు. ఆదివారం భైంసాలో పార్టీ మీటింగ్, ప్రెస్​మీట్​ నిర్వహించి మాట్లాడారు. అవినీతి, అక్రమాలతో కొనసాగుతున్న కేసీఆర్​ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఏ ఊరికి వెళ్లినా బెల్టు షాపులే కనిపిస్తున్నాయని, బంగారు తెలంగాణను మద్యం తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్​దే అని దుయ్యబట్టారు. అంతకు ముందు స్థానిక వివేకానంద ఆవాసాన్ని సందర్శించి రూ. 51వేలు ఆర్థిక సాయం చేశారు. జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్, మోహన్​రావు పటేల్, నారాయణ్​ రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు. 

బీజేపీ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్రలోని చిమూర్ ఎమ్మెల్యే  బంటి భావు బంగ్డియా పాల్గొని మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్వాయి హరీశ్ బాబు, సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ తదితర నేతలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలోని అన్ని స్థానాల్లో బీజేపీ ఖాయమని మహారాష్ట్ర కేలాపూర్​ ఎమ్మెల్యే సందీప్​ దుర్వే అన్నారు. అసెంబ్లీ ప్రవాస్ యోజన ముగింపు సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్​ జిల్లా పార్టీ కార్యాయలంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. 

జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజక వర్గంలో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహారాష్ట్ర ఎమ్మెల్యే తుషార్ రాథోడ్ అన్నారు. మస్కాపూర్ లో జరిగిన ప్రవాస్ యోజన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్యా జాను బాయ్, అజ్మీరా హరి నాయక్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.