నన్ను ఫేవర్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార కామెంట్స్

నన్ను ఫేవర్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార కామెంట్స్

స్టార్ హీరోయిన్ నయనతారకు  కాస్టింగ్  కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ఇటీవల తనను కలిసిన ఓమీడియాతో నయనతార ఈ విషయాన్ని చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నయన్  తన వ్యక్తిగత ,ప్రొఫెషనల్  లైఫ్ గురించి చాలా విషయాలు షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండస్ట్రీలో  తనకు ఓ సినిమాలో కీలక పాత్రలో నటించే చాన్స్ వచ్చిందని అయితే.. బదులుగా వారు ఓ ఫేవర్ కోరారని దీంతో ఆ అవాకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. ఇటీవల చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లో నయనతార నటించారు. అట్లీ డైరెక్షన్ లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నయన్ ఈ మధ్య సరోగసీతో ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు.