లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఆమె భర్త విఘ్నేష్ శివన్(Vignesh Shivan) నుండి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం.. ఇటీవల నయనతారా తన ఇన్‌స్టాలో విఘ్నేష్‌ను అన్ ఫాలో చేయడమే. అది కాస్త వైరల్ కావడంతో మళ్లీ ఫాలో చేసింది నయన్. అయితే ఇదంతా టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందని కొందరు అనునకుంటే.. మరికొందరేమో కావాలనే నయన్ ఆలా చేశారని. వాళ్లిద్దరూ త్వరలో విడిపోతున్నారని అనుకున్నారు.
ఆ వార్తలు కాస్త విఘ్నేష్ శివన్ వరకు చేరడంతో.. ఆయన ఓ పాత వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో విగ్నేష్, నయన్ ఎంతో ప్రేమగా ఉన్నట్లుగా కనిపించింది. దీంతో వీరి విడాకులపై వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. ఇక తాజాగా నయన కూడా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తో వారి విడాకులపై వస్తున్న రూమర్స్ ను పటాపంచలు చేసింది. ఆ ఫోటీలో ఆమె తన భర్త, పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ఆ ఫొటోకు.. చాలా రోజుల తర్వాత మా బాయ్స్‌తో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను.. అనే క్యాప్షన్ ను ఇచ్చారు. ఆ ఫొటోల్లో నయన్, విగ్నేష్ చాలా సంతోషంగా, ఆనందంగా ఉండటంతో విడాకులపై వస్తున్న న్యూస్ అన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ప్రస్తుతం నయన్ తన పిల్లలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ :- ట్రైన్‌లో సీటు దొరకనప్పుడు జోతిష్యుడిగా మారిన: మోదీ
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాధవన్, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు భర్త విగ్నేష్ శివన్ తో మరో సినిమా చేయనున్నారు నయనతార. ఈ సినిమాలో లవ్ టుడే ఫేమ్ రంగరాజన్ హీరోగా నటిస్తున్నారు.