యశ్ టాక్సిక్‌‌లో నయనతార..

యశ్ టాక్సిక్‌‌లో నయనతార..

షారుఖ్‌‌ ‘జవాన్‌‌’తో పాన్‌‌ ఇండియా సూపర్ హిట్ అందుకున్న నయనతార.. ఇప్పుడు మరో పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్‌‌లో నటిస్తోంది. యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్‌‌’ చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ రెట్రో గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో నయన్ నటిస్తున్నట్టు తాజాగా కన్‌‌ఫర్మ్ అయింది.  

ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్‌‌.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు.  ‘ప్రస్తుతం నేను యశ్ మూవీ షూటింగ్‌‌లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా భాగమయ్యారు..’ అంటూ అనుకోకుండా ఆమె పేరు చెప్పాడు.  ఇక ఇందులో కరీనా కపూర్ నటిస్తోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి కానీ టీమ్ ఎవరూ కన్‌‌ఫర్మ్ చేయలేదు. 

ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌‌లో కూడా యశ్ క్యారెక్టర్ మినహా మిగతా క్యారెక్టర్స్ ఏవీ రివీల్ చేయలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌‌పై వెంకట్ కె.నారాయణ, హీరో యశ్ కలిసి నిర్మిస్తున్నారు. ‘ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ అనే క్యాప్షన్‌‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.