TEST OTT Official: ఓటీటీలోకి నయనతార, సిద్ధార్థ్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

TEST OTT Official: ఓటీటీలోకి నయనతార, సిద్ధార్థ్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) నటించిన 75వ మూవీ ‘టెస్ట్’ (TEST) రిలీజ్‌‌‌‌కు రెడీ అయింది. అయితే, టెస్ట్ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

"మన జీవితంలో ఒక మార్పు చెందే క్షణం వస్తుంది, అది ప్రతిదీ మారుస్తుంది. అదే పరీక్ష (TEST). ఏప్రిల్ 4న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో టెస్ట్ కేవలం Netflixలో చూడండి" అంటూ నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది. 

‘టెస్ట్’ మూవీ విషయానికి వస్తే ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైనాట్ స్టూడియోస్ నిర్మించింది.  ది ఫ్యామిలీ మ్యాన్‌తో రచయితగా గుర్తింపుతెచ్చుకున్న సుమన్‌ కుమార్‌ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

Also Read :  జాన్వీ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర ట్వీట్

క్రికెట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందించిన ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, జై, మీరా జాస్మిన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నయనతార సహజమైన లుక్‌లో కనిపిస్తుంది. ఆమె పాత్ర భావోద్వేగాలతో కూడుకున్నదని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. సిద్ధార్థ్ క్రికెటర్ పాత్రను పోషిస్తుండగా, మాధవన్ కోచ్‌గా కనిపిస్తున్నాడు.

టెస్ట్ స్టోరీ:

క్రికెట్ మైదానం కారణంగా మూడు జీవితాల మధ్య సాగే కథతో తెరెకెక్కింది. ఇది ఒక జాతీయ స్థాయి క్రికెటర్, ఒక మేధావి ఐనా కోచ్‌ మరియు ఒక ఉద్వేగభరితమైన ఉపాధ్యాయుడి జీవితాల నేపథ్యంలో సాగే ఇంటెన్స్ హ్యూమన్ ఎమోషన్ గా రాబోతుంది. క్రికెట్ మైదానంతో ఒకరికి ఒకరితో ముడిపడి ఉన్న ఈ కథలో వారి ఆశయం, త్యాగం మరియు ధైర్యాన్ని పరీక్షించేదే టెస్ట్ స్టోరీ.