
నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం ‘టెస్ట్’(TEST). నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో గురువారం (ఏప్రిల్ 4న) స్ట్రీమింగ్‌కు వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్.శశికాంత్ దర్శకుడు. ఈ మూవీని వైనాట్ స్టూడియోస్ నిర్మించింది. ది ఫ్యామిలీ మ్యాన్‌తో రచయితగా గుర్తింపుతెచ్చుకున్న సుమన్ కుమార్ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది ప్రధాన కథాంశం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, టెస్ట్ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ ఓటీటీలో ఎలాంటి అంచనాలు అందుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
ఫామ్‌లో లేని క్రికెటర్ అర్జున్ వెంకట్రామన్ (సిద్ధార్థ్). రిటైర్మెంట్ తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ, బోర్డ్ అర్జున్పై ఒత్తిడి తెస్తుంది. కానీ, ఆడాలనే సంకల్పంతో ఉంటాడు. కుముద (నయనతార) ఒక ఉపాధ్యాయురాలు. IVFద్వారా సంతానాన్ని పొందాలని అనుకుంటుంది. సారా అలియాజ్ శరవణన్ (మాధవన్) హైడ్రో ఫ్యుయెల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ అనుమతి, నిధుల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురి జీవితాల మధ్యన కథనం నడుస్తోంది.
ఓ వైపు రెండుళ్లుగా ఏ మాత్రం ఫామ్‌లో లేని అర్జున్.. చివరి అవకాశంగా మ్యాచ్ ఆడడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో సెలెక్షన్ కమిటీతో వాదించి ఒప్పించుకుంటాడు. అతడి కెరీర్‌కు చావోరేవో అయిన ఆ మ్యాచ్‍లో అర్జున్‍కు అవకాశం దక్కుతుంది. అలా అర్జున్ చెపాక్‌లో జరిగే ఐకానిక్ ఇండియా vsపాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడాడానికి రెడీ అవుతాడు. అయితే, ఇది అతని చివరి మ్యాచ్ కావచ్చు అనేలా ఉంటుంది.
Also Read :- ఫైనల్లీ.. సింహం బోను దాటింది
ఈ క్రమంలోనే.. సారా రూ.50లక్షల అప్పు కష్టాలు కూడా అతడిని చుట్టుముడతాయి. తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతాడు. ఇక అదే సమయంలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ వైపు ఆలోచించడం మొదలు పెడ్తాడు. ఈ మ్యాచ్తో తన అప్పులన్నీ తీర్చాలని డిసైడ్ అవుతాడు. అయితే, అతను చేసే పని అర్జున్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది.
ఇదే అదనుగా మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ అనుమానంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ షురూ చేస్తారు. ఈ కీలకమైన మ్యాచ్ సమయంలో, కుముద, శరవణన్ మరియు అర్జున్ జీవితాలు ఎలా ముడిపడ్డాయి? సారా మ్యాచ్ విషయంలో ఏం చేశాడు? అర్జున్‍కు సారాకి మధ్య సంబంధం ఏంటీ? చివరికి అర్జున్ మ్యాచ్ గెలిపించాడా? కుముద, సారా తమ సమస్యల నుండి బయటపడ్డారా? అర్జున్ తీసుకున్న నిర్ణయానికి అతని భార్య పద్మ (మీరా జాస్మిన్) ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? అనేది మిగతా కథ.
Hunger. Anger. Ambition. This is their final play.
— Netflix India (@NetflixIndia) April 4, 2025
Watch TEST, out now in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TESTOnNetflix pic.twitter.com/SoUnFT7qeV
ఎలా ఉందంటే:
స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవే ఎక్కువ కనిపిస్తాయి. ఇదివరకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో కన్న ఇది డిఫరెంట్ అని చెప్పొచ్చు. సినిమా ముందుకు నడిచే కొద్దీ స్పోర్ట్స్ మూవీ కాస్తా థ్రిల్లర్‌లా మారుతుంది. ఇదే ఈ సినిమాకు ప్రత్యేకం అని చెప్పుకోవాలి. దానికి తోడు ట్విస్టులు, టర్నులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో టెస్ట్ సినిమా ఆకట్టుకుంటోంది.
సారాకు (మాధవన్) తన ప్రత్యేక ప్రాజెక్ట్ వెనుక పరిగెత్తాలనే కసి ఓ వైపు, తన భార్య కుముదతో సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలనే కల మరోవైపు. అయితే, ఈ విషయాల మధ్య సారా నలిగిపోతుంది. ఏం చేయలేక.. కుముద తన భర్త ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ ఉంటుంది. తల్లి అవ్వాలనే కోరిక మాత్రమే అలానే మిగిలిపోతుంది. ఈ క్రమంలో IVFద్వారా అయినా బిడ్డని కనాలని భావించటం మొదలుపెడుతుంది. మరోవైపు అర్జున్ తన కెరీర్ గురించి కీలకమైన నిర్ణయం తీసుకోవడం, తన కుటుంబాన్ని పోషించడం మధ్య నలిగిపోతాడు.
ఇలా ముగ్గురికి జీవితంలో కీలకమైన చివరి పరీక్ష అనే కోణంలో ఈ స్టోరీ ఉంటుంది. ఈ మూడు పాత్రలను బాగా రాసుకున్నారు రైటర్ సుమన్ కుమార్. కథలో ఇంటెన్స్ హ్యూమన్ ఎమోషన్ ఉండేలా దర్శకుడు శశికాంత్ స్క్రీన్ ప్లే మలిచిన తీరు ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ కథలో వారి ఆశయం, త్యాగం మరియు ధైర్యాన్ని పరీక్షించేలా టెస్ట్ స్టోరీ నడిచిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇందులో ఈ ముగ్గురు ఎదుర్కొనే సవాళ్లు, మానసిక సంఘర్షణను లోతుగా చూపించడంలో రచయిత, దర్శకుడు విజయం సాధించారు. ఈ మూవీ రన్‍టైమ్ సుమారు 2 గంటల 25 నిమిషాలు ఉండడం కలిసొచ్చే అంశం.