Nayanthara: తెరపైకి నయనతార వంద కోట్ల ప్రాజెక్ట్.. అమ్మోరు తల్లి సీక్వెల్ షురూ..

Nayanthara: తెరపైకి నయనతార వంద కోట్ల ప్రాజెక్ట్.. అమ్మోరు తల్లి సీక్వెల్ షురూ..

నయనతార లీడ్ రోల్‌‌‌‌లో రూపొందుతోన్న చిత్రం ‘మూకుతి అమ్మన్2’. ఐదేళ్ల క్రితం ఆర్జే బాలాజీ తెరకెక్కించిన చిత్రానికిది సీక్వెల్. ఫస్ట్ పార్ట్  ‘అమ్మోరు తల్లి’గా తెలుగులో విడుదలై  ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది.

తాజాగా దర్శకుడు సుందర్ సి అమ్మోరు తల్లి రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. కోటి రూపాయల విలువైన గ్రాండ్ సెట్‌‌‌‌లో గురువారం (మార్చి 6న) చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని  ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఖుష్బూ, మీనా, సునీల్ నారంగ్, జగదీష్, సి.కళ్యాణ్  అతిథులుగా హాజరవగా, ఇందులో నటిస్తున్న రెజీనా, యోగిబాబు తదితరులు పాల్గొన్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తో కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహ నిర్మాతలుగా  ఉన్నాయి.

ALSO READ | Ketika Sharma: అదిదా సర్‌‌‌‌ప్రైజు.. నితిన్తో కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌‌

అన్‌‌‌‌ లిమిటెడ్ నవ్వులతో,  ఎక్సయిటింగ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు  మేకర్స్ చెప్పారు.రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం మంచికి, చెడుకి మధ్య జరిగే యుద్ధం అని ట్యాగ్ ఇచ్చారు. దునియా విజయ్, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్,  ఇనియా, మైనా నందిని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ సంగీతం అందిస్తున్నాడు.