తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషలలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఇప్పటివరకూ నయనతార దాదాపుగా 75 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించింది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, నంది అవార్డు మరియు ఏడు సైమా అవార్డులతో సహా మరిన్ని అవార్డులను అందుకుంది.
దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ నయనతార జీవితం ఆధారంగా "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" పేరుతో డాక్యుమెంటరీ తీశారు. నవంబర్ 18న నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార వ్యక్తిగత మరియు సినీ జీవితానికి సంబందించిన విషయాలు పొందుపరిచారు.
Also Read :- బాలీవుడ్ హర్రర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..
తెలుగులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ, రవితేజ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఒక్కో సినిమాకి నయనతార దాదాపుగా 6 నుంచి రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది అట్లీ కుమార్ హిందీలో డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాగా పెద్ద హిట్ అయ్యింది.