వెండితెరపై బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసిన నయనతార

వెండితెరపై బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసిన నయనతార

నయనతార(Nayanthara).. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అగ్ర హీరోల సరసన నటించి..రెండూ ఇండస్ట్రీల్లోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. ఇవాళ నయనతార 39వ పుట్టిన రోజు. ఇన్నేళ్ల వయసులోనూ కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ..టాప్ హీరోయిన్‌గా ఆమె రాణిస్తోంది. అంతేకాకుండా..అన్నీ ఇండస్ట్రీల టాప్ హీరోస్ తో హీరోయిన్ గా నటిస్తూ వెండితెరపై బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.     

తమిళం సినిమా 'మనస్సినక్కరే' లో తొలిసారి హీరోయిన్‌గా నయనతార నటించింది. 'లక్ష్మీ' సినిమాతో తెలుగులోకి ఆరంగ్రేటం చేసింది. 'శ్రీరామరాజ్యం' మూవీలో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది నయనతార. ఈ మూవీకి ‘ఫిల్మ్‌ఫేర్, నంది’ అవార్డులు కూడా ఆమె దక్కించుకుంది. 1984 నవంబరు 18న బెంగళూరులో పుట్టింది నయనతార. ఈమె తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్.

ఇటీవల షారుక్​ ఖాన్​తో నయన్​ జవాన్లో నటించింది. ఈ మూవీతో హిందీ ఆడియెన్స్​ను సైతం మెస్మరైజ్​ చేసింది. తొలి సినిమానే బ్లాక్​బస్టర్​ కొట్టడంతో ఇప్పుడు బాలీవుడ్​ దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్​ కోసం క్యూ కట్టారట. దీంతో తన క్రేజ్​కి తగ్గట్టే రెమ్యూనరేషన్​ను కూడా భారీగా పెంచిందని టాక్​.

జవాన్​కు మూవీకి రూ.10 కోట్లు అందుకోగా తన నెక్ట్స్​ సినిమాకు రూ.13 కోట్లు డిమాండ్​ చేస్తోందట. అలాగే జీఎస్టీ ఛార్జీల కోసం అదనంగా మరో కోటి డిమాండ్ చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ హిందీలో నయనతార తరువాతి ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. 

ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా బన్సాలీ మూవీలో నయన్​చాన్స్​కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ మొత్తంలో రికార్డ్ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడం వల్ల నయన్ ఆస్తుల వివరాలు బానే పెరిగాయని సమాచారం. 

తన సొంత ఊరిలోనే కాదు హైదరాబాద్ లో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయట నయనతారకు. హైదరాబాద్ లో ఈ అమ్మడుకు రెండు లగ్జురియాస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వాటి ఖరీదు ఒక్కోటి రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Shivan)ను ప్రేమించి  2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది నయన్ . వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.