‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదంలో భాగంగా నటుడు ధనుష్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్ దంపతులు, నెట్ ఫ్లిక్స్ పై ఆయన పిటిషన్ వేశారు. అయితే ధనుష్ దావాను సవాల్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
మంగళవారం (జనవరి 28న) న్యాయస్థానం నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్' డాక్యుమెంటరీపై తమిళ నటుడు ధనుష్ కాపీరైట్ క్లెయిమ్‌లను కలిగి ఉండాలన్న నెట్‌ఫ్లిక్స్ అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
చెన్నైలో ఈ కేసును కొనసాగించేందుకు ధనుష్ నిర్మాణ సంస్థ ఐన (వండర్‌బార్ ఫిల్మ్స్‌కు).. గతంలో కోర్టు అనుమతిని రద్దు చేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ స్థానిక కంటెంట్ విభాగం (లాస్ గాటోస్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియా ఎల్‌ఎల్‌పి) నుండి వచ్చిన దరఖాస్తును కూడా జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ తిరస్కరించారు. ఈ తాజా తీర్పుతో హీరో ధనుష్కు పెద్ద విజయమే దక్కిందని చెప్పాలి.
ALSO READ | OTT Movies: ఓటీటీలోకి (జనవరి 28-31) వరకు 10కి పైగా సినిమాలు, సిరీస్లు.. తెలుగులో ఈ 3 చాలా స్పెషల్
నవంబర్ 2024లో నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ మరియు వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. Dec 12న న్యాయస్థానం ఈ కేసును విచారించింది. 2025 జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులను, నెట్ ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ధనుష్ దావాను సవాల్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో నేడు విచారణ జరిపిన కోర్టు నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
నయన్ ధనుష్ వివాదం:
2022లో నయనతార - విఘ్నేష్ శివన్ చెన్నై మహాబలిపురంలోని స్టార్ హోటల్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహ వీడియో ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ కు భారీ ధరకు ఇచ్చారు. వీరి మ్యారేజ్కి అయిన మొత్తం ఖర్చు రూ.10 కోట్ల కంటే తక్కువే అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్‌కు వివాహ వీడియో ప్రసార హక్కులను రూ.25 కోట్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో వీరి పెళ్లి వీడియోలో 'బియాండ్ ది ఫెయిరీటేల్‌లో' 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి నిర్మాత ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా, తగిన అనుమతి లేకుండా 3 సెకన్ల వీడియో వాడారని ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. దాంతో నయన్ తనదైన శైలిలో మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసి ధనుష్పై విరుచుకుపడింది. ప్రస్తుతం వీరి వివాదం కొనసాగుతోంది.