సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నయనతార తమిళ్, తెలుగు, హిందీ తదితర భాషలలో సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇటీవలే నయనతార జీవితగాథ ఆధారంగా 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో నయనతార వ్యక్తిగత జీవితంతోపాటూ సినీ జీవితంలో ఎదుర్కున్న సంఘటనలు కూడా చిత్రీకరించారు.
ఇందులో నయనతార గ్లామర్ వరల్డ్ లో బాడీషేమింగ్ సంఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో ముఖ్యంగా తమిళ్ ప్రముఖ డైరెక్టర్ విష్ణువర్ధన్ స్టార్ హీరో అజిత్ కాంబినేషన్ లో వచ్చిన బిల్లా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బికినీలో కనిపించింది. దీంతో కొందరు తన స్కిన్ కలర్ చూసి నల్లగా ఉందని కామెంట్లు చేశారట. దీనిపై కొందరు అభ్యంతరాలు కూడా తెలిపారు.
ALSO READ | అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!
దీంతో ఈ విషయంపై నయనతార స్పందిస్తూ బికినీ తనకోసం లేదా పాపులర్ అవ్వడం కోసం ధరించలేదని, కేవలం సీన్ డిమాండ్ చేయడం వలన ధరించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. అలాగే గజిని సినిమాలో నటించేటపుడు కూడా లావుగా ఉన్నానని, ఎందుకు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని విమర్శలు చేశారని చెప్పుకొచ్చింది. కానీ అవన్నీ అధిగమించి ఇవ్వాళ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ అని అందుకుంది.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నటి నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్ తదితర భాషలలో కలిపి దాదాపుగా 8కి పైగా సినిమాల్లో నటిస్తోంది. ఇందులో 3 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.