Nayanthara: డియర్ స్టూడెంట్స్ టీచర్‌ వచ్చేస్తోంది.. ప్రేమమ్ హీరోతో గ్లామరస్ నయనతార

Nayanthara: డియర్ స్టూడెంట్స్ టీచర్‌ వచ్చేస్తోంది.. ప్రేమమ్ హీరోతో గ్లామరస్ నయనతార

హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార (Nayanthara). స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు ఫిమేల్‌‌‌‌ లీడ్‌‌‌‌గానూ వరుస చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రంలో ఆన్ బోర్డ్ అయినట్టు ఇటీవలే అనౌన్స్ చేశారు మేకర్స్. మలయాళ నటుడు నివిన్ పౌలీ (Nivin Pauly) హీరోగా చేస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’ (Dear Students) చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుంది. 

Also Read:-శర్వానంద్ కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

లేటెస్ట్ గా ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో క్రేజీ ఫోటో షేర్ చేసింది నయన్. ఇందులో ఆమె విద్యా రుద్రన్‌ అనే టీచర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రీసెంట్ గా మేకర్స్ పోస్ట్ చేసిన పోస్టర్ లో.. 'క్లాస్ రూమ్‌‌‌‌ను చూపిస్తూ, అందులో కొన్ని పేపర్స్ ఎగురుతుండగా, చేత్తో పెన్నును తిప్పుతున్నట్టుగా కనిపిస్తున్న నయన్' నెటిజన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం నయన జాబితాలో ‘అమ్మోరు 2’, ‘టెస్ట్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి.

ఈ సినిమాని జార్జ్‌‌‌‌ పిలిప్ రాయ్‌‌‌‌, సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నివిన్ పౌలీ హోం బ్యానర్‌‌‌‌ పౌలీ జేఆర్ పిక్చర్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌పై కర్మ మీడియా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ, నయనతార సొంత బ్యానర్  రౌడీ పిక్చర్స్‌‌‌‌, ఆల్ట్రా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.