Nayanthara: చిరు-అనిల్ మూవీ: నయనతార భారీ రెమ్యూనరేషన్ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాక్!

Nayanthara: చిరు-అనిల్ మూవీ: నయనతార భారీ రెమ్యూనరేషన్ డిమాండ్.. ఎంతో తెలిస్తే షాక్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ రాబోతుంది. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటినుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అనిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్ తో మరింత క్రేజ్ ఉంది.

లేటెస్ట్గా మెగా 157 మూవీలో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించారని సమాచారం. ఈ రోల్ కోసం నయన్ రూ.18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందట. అయితే, నయనతార బాలీవుడ్‌ మూవీ జవాన్‌ కోసం రూ.12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

అలాగే మెగా 157 హీరోయిన్ పాత్ర కోసం వేరే ఆప్షన్ కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ మూవీలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కూడా నటించనున్నట్లు టాక్.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కాగా చిరంజీవి, నయనతార ఇప్పటికీ గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.