
తనను "లేడీ సూపర్ స్టార్" అని పిలవడం మానేయాలని నయనతార (Nayanthara) కోరింది. ఈ మేరకు మంగళవారం మార్చి 4న నయనతార X ఖాతా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నయనతార తన అభిమానులకు మరియు మీడియాకు తనను లేడీ సూపర్ స్టార్ అని కాకుండా నయనతార అని మాత్రమే పిలవాలని విజ్ఞప్తి చేసింది.
తనకు "ఇంత విలువైన బిరుదు" ఇచ్చినందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఫ్యాన్స్ అలా పిలవడం తనకు హ్యాపీగా ఉన్నా 'నయనతార' అని అనే పేరే తన హృదయానికి దగ్గరైంది తెలిపారు. ఎందుకంటే, మీ ప్రేమ, మద్దతు స్థిరంగా ఉండటమే నా నిజమైన సంతోషం. ఇక అభిమానులని అలరించడానికి నా కృషి ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అలాగే ఈ సినిమా తల్లి మనల్ని ఎప్పటికీ ఐక్యంగా ఉంచుతుందని నయనతార నోట్ ద్వారా వెల్లడించింది.
NAYANTHARA will always be and only NAYANTHARA🙏🏻 pic.twitter.com/fZDqhXM4Vl
— Nayanthara✨ (@NayantharaU) March 4, 2025
కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ నయనతార అంటే సూపర్ యాక్టర్. వరుస సినిమాలతో బిజిబిజీగా ఉంటుంది. అలాగే సినిమా అయినా, యాడ్స్ అయినా తనదైన స్టైల్ లో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంది. ఆమధ్య ఓ పదినిమిషాల యాడ్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే తాను ఒక్కో సినిమాకు రూ.10 నుండి 15 కోట్లు తీసుకుంటుందని టాక్.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు రానుంది.
ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్, రక్కయిర్, మమ్ముట్టి మరియు మోహన్ సినిమాలలో కూడా కనిపిస్తుంది.