అన్నపూరణి(Annapurani) సినిమా వివాదంపై క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు నయనతార(Nayantara). ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ అన్నపూరని. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అన్నయ్యని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.
దీంతో ఈ సినిమాను స్ట్రీమింగ్ నుండి తొలగించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. అయినప్పటికి వివాదం ఆగకపోవడంతో తాజాగా క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు నయనతార.. సెన్సార్ అనుమతితో థియేటర్లలో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ నుండి తొలగిస్తారని మేము ఊహించలేదు. ఈ సమస్య తీవ్రత ఏమిటో మాకు అర్థమైంది. నేను భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శిస్తూనే ఉంటాను. అన్నపూర్ణి సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని. వారికి బాధ కలిగించివుంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని.. లేఖలో పేర్కొన్నారు నయనతార.
ఇక అన్నపూరని సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మణ కుంటుంబానికి చెందిన యువతిగా కనిపించారు. ఆమెకు చెఫ్ అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడుతుంది. ఆ క్రమంలో ఒక ముస్లిం అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఒకసాగారి అన్నపురణిని మాంసం తినేలా ఒప్పిస్తాడు. దానికి ఉదాహరణగా రాముడు కూడా మాసం తినేవాడని చెప్తాడు. ఇదే విషయంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ పిటీషన్స్ దాఖలు చేశాయి.