లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) తో విడిపోతున్నారా? ఇన్స్టాలో ఆమె పుట్టిన పోస్ట్ కి అర్ధం ఏంటి? విగ్నేష్ శివన్ ను ఆమె ఎందుకు అన్ఫాలో చేశారు? ప్రస్తుతం నయనతార ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. తాజాగా ఆమె ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ అనుమానాలకు దారితీస్తోంది. దీంతో ఈ జంట త్వరలో విడిపోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నయనతార ఇటీవలే ఇన్స్టాగ్రాంలోకి అడుగుపెట్టారు. తన పర్సనల్ లైఫ్, పిల్లలు, సినిమాలుక్ సంబందించిన ఫోటోలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు తన బిజినెస్ కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన ఇన్స్టాలో.. ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభిస్తుందని ఎప్పటికీ చెబుతుంది(She's gonna forever say "I got this" even with tears in her eyes) అనే స్టేటస్ పెట్టారు. అనంతరం భర్త విగ్నేష్ ను అన్ఫాలో చేశారు నయన్. దీంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయన్ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట కూడా విడిపోతున్నారు? మొన్ననే కదా పిల్లలు పుట్టారు అప్పుడేనా? అంటూ స్పందింస్తున్నారు. అయితే నయనతార ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.