మళయాళ నాయట్టు(Nayattu) సినిమాకు రీమేక్ గా వచ్చిన కోటబొమ్మాళి పీఎస్ ఆడియన్స్ ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథా, కథనం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే,క్లైమాక్స్ పోర్షన్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య వచ్చే స్క్రీన్ ప్లే, ఇక వాళ్ళిద్దరి మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ సీన్స్ థియేటర్‌లలో ప్రతి ఒక్కరినీ సీట్లకు అతుక్కునెలా చేశాయి.
అంతేకాదు చాలా కాలం తర్వాత శ్రీకాంత్ కి అద్భుతమైన పాత్ర దక్కిందనే చెప్పుకోవొచ్చు. అంతే అద్భుతంగా ఆయన కూడా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..?
Also Read:మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో
వివరాల్లోకి వెళితే..కోటబొమ్మాళి పీఎస్ సినిమా మళయాళ నాయట్టు కి తెలుగులో కొంతమేరకు మార్పులు చేర్పులు చేస్తూ రీమేక్ అయిన విషయం తెలిసిందే. కానీ,ఒరిజినల్ సినిమా అయిన నాయట్టు మాత్రం ఎలా ఉంటుందో కొంత మంది తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెల్వదు. అందుకనే తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.
పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాయట్టు' కేరళలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది ఆహా. అయితే తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్'గా (Chunduru Police Station) డబ్బింగ్ చేశారు. "పోలీస్ వెంట పోలీస్ పడితే..! వస్తోంది 'చుండూరు పోలీస్ స్టేషన్' మీ ఆహాలో..ఈ శుక్రవారం ఏప్రిల్ 26న ఆహా లో" స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ఆహా ఓటీటీ ప్రకటించింది. మరి ఈ ఒరిజినల్ నాయట్టును చూడాలంటే ఆహా లాగ్ ఇన్ అయ్యి థ్రిల్లర్ ను ఎంజాయ్ చేసేయండి.
పోలీస్ వెంట పోలీస్ పడితే..!🚔
— ahavideoin (@ahavideoIN) April 23, 2024
వస్తోంది 'చుండూరు పోలీస్ స్టేషన్' మీ ఆహాలో..👮🏻♂️ #Nayattu Premieres from 26th 🎬📷 pic.twitter.com/jZW54K13YU