న్యూఢిల్లీ: సుమారు రూ.1,120 కోట్ల జీఎస్‌టీ కట్టాలని గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ సబ్సిడరీలు బుధవారం షోకాజ్ నోటీసులను అందుకున్నాయి. జీఎస్‌టీ బకాయిలు పేరుకుపోవడంతో రెండు నజారా టెక్ సబ్సిడరీ కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్‌టీ రూ. వెయ్యి కోట్లను దాటింది. రూ.845.72 కోట్ల జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కోల్‌కతా నుంచి ఓపెన్‌ప్లే టెక్నాలజీస్ షోకాజ్ నోటీసులు అందుకోగా, రూ. 274.21 కోట్ల జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని హలప్లే టెక్నాలజీస్ నోటీసులు అందుకుంది.
2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం మధ్య గల కాలానికిగాను ఈ నోటీసులను అధికారులు ఇష్యూ చేశారు. తమ రెండు సబ్సిడరీ కంపెనీలు అందుకున్న ట్యాక్స్ నోటీసులపై నిపుణులతో చర్చించి స్పందిస్తామని నజారా టెక్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.