ఫహద్ ఫాజిల్ వైఫ్ నజ్రియా నజీమ్ మరియు బాసిల్ జోసెఫ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని( Sookshmadarshini). MC జితిన్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇపుడీ ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది.
సూక్ష్మదర్శిని ఓటీటీ:
సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే థియేటర్ ఆడియన్స్ కి భలే కిక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీ రైట్స్ ని జీ 5 మంచి ధరకు దక్కించుకున్నట్టు టాక్. ఈ మూవీ 2025 జనవరి సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ పై జీ 5 క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మలయాళ సినిమాకి నజ్రియా నజీమ్ ఎంట్రీ ఇచ్చింది. చివరగా తన భర్త ఫహద్ ఫాజిల్ ట్రాన్స్ మూవీలో నటించింది. ఈ సూక్ష్మదర్శిని మూవీలో నజ్రియా నజీమ్ మరియు బాసిల్ జోసెఫ్ అద్భుతంగా నటించారు.
సూక్ష్మదర్శిని కథ:
ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) హౌజ్ వైఫ్. భర్త, కూతురుతో కలిసి సంతోషంగా ఉంటుంది. ఇరుగుపొరుగువారి విషయాల్లో ప్రియకు చాలా ఆసక్తి ఉంటుంది. అలా ఆమె తన చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి తెలుసుకోవాలనుకుంటోంది. వారి రోజువారీ జీవితాలు, స్థానిక సంఘటనలు మొదలైన వాటి గురించి తనతో పాటు మరికొంతమంది మహిళలు వాట్సాప్ లో ఒకరికొకరు అప్‌డేట్ చేసుకుంటారు.
Also Read :- సీఎంతో మీటింగ్కు బడా నిర్మాతల తహతహ
అలా ప్రియ పక్కింట్లోకి కొత్తగా వచ్చిన మాన్యుయేల్ (బాసిల్ జోసెఫ్) వింత ప్రవర్తన ప్రియలో అనుమానాల్ని రేకెత్తిస్తుంది. అంతలో మాన్యుయెల్ తల్లి అల్జీమర్స్ కారణంగా రెండుసార్లు ఇంటి నుండి కనిపించకుండా పోతుంది. ఇంతకీ అల్జీమర్స్ కారణంగా వెళ్లిపోయిందా ? లేదంటే తన కొడుకుని తప్పించుకుని పోయిందా? అనే కోణంలో కథనం ఆసక్తి కలిగిస్తోంది.
దాంతో ప్రియ తనదైన కోణంలో మాన్యుయేల్ లైఫ్ గురించి ఇన్వేస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా మాన్యుయేల్ గురించి ప్రియకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? ఈ క్రమంలో ప్రియ ఎలా చిక్కుల్లో పడింది అన్నదే ఈ మూవీ కథ.