సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలన్న ఎన్‌‌‌‌‌‌‌‌.బలరామ్‌‌‌‌‌‌‌‌

  •     సింగరేణి సీఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌.బలరామ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సంస్థ సీఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌.బలరామ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల జీఎంలను కోరారు. శనివారం తెల్లవారుజామున ఓపెన్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ 3, జీడికె 2వ భూగర్భ గనుల్లో పర్యటించి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌లో కార్మికులతో కలిసి టిఫిన్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం ఇల్లందు క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆవరణలోని క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పర్సనల్‌‌‌‌‌‌‌‌ జీఎం బి.హన్మంతరావు, ఆర్జీ 1 జీఎం చింతల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఆర్జీ 2 జీఎం ఎల్‌‌‌‌‌‌‌‌వి సూర్యనారాయణ, ఆర్జీ 3 జీఎం ఎన్‌‌‌‌‌‌‌‌.సుధాకర్‌‌‌‌‌‌‌‌రావు, ఏఎల్‌‌‌‌‌‌‌‌పి జీఎం కె.వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ ఏరియా జీఎం సంజీవరెడ్డి, సేప్టీ రీజియన్‌‌‌‌‌‌‌‌ జీఎం ఎస్‌‌‌‌‌‌‌‌.సాంబయ్య, ఎస్‌‌‌‌‌‌‌‌ఓటు జీఎం రాంమోహన్‌‌‌‌‌‌‌‌, పర్సనల్‌‌‌‌‌‌‌‌ ఏజీఎం లక్ష్మినారాయణ, తదితరులతో బొగ్గు ఉత్పత్తి, సంక్షేమంపై సమీక్ష జరిపారు.

సంస్థకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మ్యాపుల ద్వారా చర్చించారు. బొగ్గు ఉత్పత్తి మెరుగుపరిచేందుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సీఎండీ బలరామ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎల్లప్పుడు ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. కార్మికులకు శాశ్వాతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాపిడ్‌‌‌‌‌‌‌‌ గ్రావిటీ ఫిల్టర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేయబోతున్నట్టు చెప్పారు.