NBK 109 Glimpse: సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్..ఇట్స్ హంటింగ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఊచకోత మరోసారి కనిపించింది.

డైరెక్టర్ బాబీ బాలయ్యను మరో రేంజ్ లో చూపించాడు. అడవిలో కార్చిచ్చు మధ్య..బాలయ్య కారులో నుంచి దిగడం..బాక్స్ ఓపెన్ చేయడం మ్యాన్షన్ హౌస్ తో కిక్ ఇచ్చేశాడు. అంతేకాకుండా..'సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ ..హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎక్కించేశాడు. ఇప్పుడు రిలీజైన గ్లింప్స్ ఏ ఇలా ఉంటే..సినిమా ఎలా ఉండనుందో మరి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

ALSO READ :- బిస్తర్ సర్దేశారా?: మహారాష్ట్రలో కారు ఆగమాగం.. ఆఫీసులకు కిరాయిలు కడ్తలే

ఈ మూవీలో ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు.మన తెలుగు వాళ్లకి సీతారాముడిగా..ఎంతో సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (DulquarSalman) నటిస్తున్నట్లు సమాచారం.