ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా అంటూ బాలయ్య పవన్ కు వెలక్ కమ్ చెప్పారు. షోలో సాయిధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇస్తాడు. అంతేగాకుండా బాలయ్య పవన్ ను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ముఖ్యంగా గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ సీన్, త్రివిక్రమ్ తో స్నేహం, రామ్ చరణ్ తో క్లోజ్ నెస్, సాయిధరమ్ తేజ్ తో అనుబంధం గురించి ప్రస్తావించారు. అంతేగాకుండా పవన్ ముడు పెళ్లిళ్ల గురించి కూడా బాలయ్య నేరుగా పశ్నించాడు..ఈపెళ్లిళ్ల గోల ఏంది భయ్యా? అంటూ అడిగేశాడు. అలాగే మీకు అమ్మంటే భయమా.? మీ ఆవిడంటే భయమా అని పవన్ ను ప్రశ్నించారు బాలయ్య. దీనికి పవన్ ఎటువంటి సమాధానం చెప్పాడనేది పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే గానీ తెలియదు.