నాగచైతన్య 24వ మూవీ ..ఇంట్రెస్టింగ్ వీడియో

నాగచైతన్య 24వ మూవీ ..ఇంట్రెస్టింగ్ వీడియో

‘తండేల్’ సక్సెస్ తర్వాత మరో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  నాగ చైతన్య నటిస్తున్న 24వ చిత్రమిది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్  ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలియజేస్తూ.. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏ విధంగా చేశారు, సెట్ వర్క్,  రిహార్సల్స్, షూటింగ్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపిస్తూ సాగిన ఈ వీడియో  సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. 

నాగ చైతన్య తన పాత్ర కోసం ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అయ్యాడు. ‘పాతి పెట్టిన రహస్యాలు, కాలానికి అతీతంగా ది ర్యాగింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమైంది’ అంటూ  ఈ సందర్భంగా చైతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మరింత ఆసక్తిని పెంచింది.  ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం,  నీల్ డి కున్హా డీవోపీగా,  నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. ఈ  మిథికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగ చైతన్య కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెప్పారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.