తీహార్ జైలు మాజీ వార్డెన్ ఏకంగా ల్యాబ్ పెట్టే.. డ్రగ్స్ తయారు చేస్తుండు

తీహార్ జైలు మాజీ వార్డెన్ ఏకంగా ల్యాబ్ పెట్టే.. డ్రగ్స్ తయారు చేస్తుండు

ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ల్యాబ్ పెట్టి.. డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు.  అక్టోబర్ 25న ల్యాబ్ పై దాడులు చేయగా.. అక్టోబర్ 29న ల్యాబ్ ఓనర్స్ ని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 25న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, యూనిట్ స్పెషల్ సెల్, ఢిల్లీ పోలీసులు కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేశారు. ఇందులో ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లా కసానా ఇండస్ట్రియల్ ఏరియాలో రహస్యంగా నడుపుతున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌ను గుర్తించారు. 

అధికారులు లిక్విడ్, సాలిడ్ రూపాల్లో ఉన్న 95 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.  నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తీహర్ జైలు మాజీ వార్డెన్, ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త ఇద్దరూ కలిసి ఈ దందా చేసున్నారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు. మెథాంఫెటమైన్ తయారీకి అవసరమైన రసాయనాలను వివిధ కంపెనీల నుంచి తెప్పిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ల్యాబ్ లో దాదాపు 95 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ దొరికింది. ఈ ల్యాబ్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ సఫ్లై చేస్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్తున్నారు.  

ALSO READ | కోర్టులో లాయర్లపై లాఠీఛార్జి : పోలీసులను జడ్జే పిలిపించారట

ముంబయికి చెందిన ఓ కెమికల్ సైంటిస్టు ఈ డ్రగ్‌ను తయారు చేసేందుకు ల్యాబ్, వారిద్దరినీ పెట్టుకున్నారని NDPS అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. డ్రగ్ క్వాలిటీ ఢిల్లీలో నివసిస్తున్న మెక్సికన్ డ్రగ్ కార్టెల్ మెంబర్ టెస్ట్ చేస్తడని ఆయన చెప్పారు. ఈ నలుగురిని అరెస్టు చేసి అక్టోబర్ 27న ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టు ముందు హాజరుపరిచామని, వారిని మూడు రోజులపాటు ఎన్‌సిబి కస్టడీకి పంపామని అధికారి తెలిపారు. ఈ ఏడాది గుజరాత్‌లోని గాంధీనగర్, అమ్రేలి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ మరియు సిరోహి మరియు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇప్పటి వరకు ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్న ఐదు సీక్రెట్ ల్యాబ్స్ ను కనిపెట్టినట్లు ఏజెన్సీ పేర్కొంది.