వీడెవడ్రా బాబూ.. ఏకంగా మత్తు మందే తయారు చేస్తున్నాడు..

వీడెవడ్రా బాబూ.. ఏకంగా మత్తు మందే తయారు చేస్తున్నాడు..

సంగారెడ్డి జిల్లాలో NCB ( నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ) అధికారులు  కొరడా ఝళిపించారు.  గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో భారీగా మత్తు పదార్ధాలను సీజ్ చేశారు.  శ్రీ వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమలో 32 కిలోల అల్ఫోజోలం  NCB ( నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ) అధికారులు పట్టుకున్నారు.  మత్తు మందును తయారుచేస్తున్న రమేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇండస్ట్రీ ఎండీ సత్యనారాయణ దగ్గర రియాక్టర్ ను లీజుకు తీసుకొని రమేష్ రెడ్డి మత్తు మందును తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే నిందితుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణాజిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.