కొత్తపల్లి, వెలుగు : అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్లో నిర్వహించిన జాతీయస్థాయి ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ క్యాంపులో మంకమ్మతోట పారమిత స్కూల్ ఎన్సీసీ కేడెట్లు ప్రతిభ చాటినట్లు హెచ్ఎం బాలాజీ తెలిపారు. పింగిళి విజికారెడ్డి (కూచిపూడి నాట్యం), బూడిద రేవంత్ కౌశిక్(ఎన్ఐఏపీ -సంస్కృతి), గౌడ హృదయ్ (వాయిద్యం), గజ్జెల అశ్విత్ (ఎన్ఐఏపీ సంస్కృతి), అడ్ల హన్సిత్(ఎన్ఐఏపీ- సంస్కృతి) ప్రదర్శన ఇచ్చారు.
వీరిని పారమిత ఎన్సీసీ కేడెట్లను బెటాలియన్ కమాడింగ్ ఆఫీసర్ డానియల్ లాట్జమ్, స్కూల్ చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేశ్, రశ్మిత, అనుకర్రావు, వినోదరావు, హనుమంతరావు అభినందించారు.
ALSO READ : కరీంనగర్ జిల్లాలో వాహనాలను తనిఖీ చేసిన సీపీ