![ఎన్‌సీసీతో క్రమశిక్షణ : లెప్ట్ నెంట్ కల్నల్ విష్ణు పి నాయర్](https://static.v6velugu.com/uploads/2025/02/ncc-lieutenant-colonel-vishnu-p-nair-says-students-will-learn-discipline-through-ncc_caQSA7zf5C.jpg)
కామారెడ్డిటౌన్, వెలుగు: ఎన్‌సీసీతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని ఎన్సీసీ లెప్ట్ నెంట్ కల్నల్ విష్ణు పి నాయర్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఎన్సీసీ స్టూడెంట్స్‌తో మీటింగ్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. ఎన్సీసీలో చేరడమే కాకుండా రెగ్యులర్‌గా క్యాంపులకు పరేడ్‌కు హాజరవ్వాలన్నారు. కాలేజీ సీఈవో జైపాల్‌రెడ్డి, కాలేజీ చైర్మన్ భాస్కర్‌రావు, ప్రిన్సిపాల్స్ సైదయ్య, దత్తాద్రి, నవీన్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.