కాఫీ డేపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు

కాఫీ డేపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు

న్యూఢిల్లీ : కాఫీ హౌస్‌‌లను నిర్వహిస్తున్న కాఫీ డే గ్రూప్‌‌కు చెందిన పేరెంట్ ​కంపెనీ కాఫీ డే ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్​)పై కార్పొరేట్ వివాద ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.  ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐడీబీఐటిఎస్‌‌ఎల్)కు రూ. 228.45 కోట్లు చెల్లించడంలో విఫలమవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంగళూరు బెంచ్ ఆగస్టు 8న ఈ ఆదేశాలు జారీ చేసింది.  అప్పుల నిర్వహణను చూసుకోవడానికి ఇంటెరిమ్​ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌‌ని నియమించింది.

 సీడీఈఎల్​ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీల)  చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయింది. ఫైనాన్షియల్​క్రెడిటర్​ ప్రైవేట్ ప్లేస్‌‌మెంట్ ద్వారా 1,000 ఎన్‌‌సీడీ సబ్‌‌స్క్రయిబ్ చేసింది.  అయితే, సీడీఈఎల్​ సెప్టెంబర్ 2019 – జూన్ 2020 మధ్య వివిధ తేదీలలో చెల్లించాల్సిన మొత్తం కూపన్ పేమెంట్లను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది. దీంతో డిబెంచర్ ట్రస్టీ, డిబెంచర్ హోల్డర్లందరి తరపున, జూలై 28, 2020న సీడీఈఎల్​కి డిఫాల్ట్ నోటీసు జారీ చేసి ఎన్సీఎల్టీని సంప్రదించింది.