కన్నడ స్టార్ హీరో దర్శన్ పై మరో కేసు..

కన్నడ స్టార్ హీరో దర్శన్ పై మరో కేసు..

కన్నడ ప్రముఖ హీరో దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్యకేసులో అరెస్ట్ అయ్యి బళ్లారిలో జైలు జీవితం గడుపుతున్నాడు.ఈ క్రమంలో బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నపటికీ కోర్టు మాత్రం కనికరించడం లేదు. దీంతో దర్శన్ పలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని దీంతో బెయిల్ మంజూరు చెయ్యాలని సోమవారం (అక్టోబర్ 14)  దర్శన్ తరుపు న్యాయవాదులు కోర్టుని కోరారు. అయినప్పటికీ కోర్టు బెయిల్ మంజారు చెయ్యలేదు.

ALSO READ | క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన అనన్య నాగళ్ల

అయితే నటుడు దర్శన్ పై మరో కేసు నమోదైంది. కన్నడ సినీ వర్గాల సమాచారం ప్రకారం గతంలో ప్రముఖ సినీ నిర్మాత భరత్‌ని బెదిరించినట్లు దర్శన్ తూగుదీపపై ఆరోపణలు వచ్చాయి. దీంతో శుక్రవారం (అక్టోబర్ 18) కర్ణాటకలోని కెంగేరి పోలీస్ స్టేషన్‌లో నటుడు దర్శన్ పై పలు సెక్షన్ల క్రింద ఎన్‌సీఆర్ నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.