హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు

హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు చేసిన్రు

యూపీ పోలీసులను వివరణ కోరిన ఎన్‌‌‌‌‌‌‌‌సీడబ్ల్యూ 

న్యూఢిల్లీ: హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలను అంత అర్జెంట్ గా అర్ధరాత్రి ఎందుకు చేయాల్సి వచ్చిందని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్ సీడబ్ల్యూ) ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. హత్రాస్ లో జరిగిన క్రూరమైన గ్యాంగ్ రేప్ షాక్ కు గురి చేసిందని ఎన్ సీడబ్ల్యూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్యామిలీ మెంబర్ల అనుమతి లేకుండా బాధితురాలి అంత్యక్రియలను పోలీసులే అర్ధరాత్రి చేయడంపై రిపోర్టు వచ్చిందని చెప్పింది. ‘‘దహన సంస్కారాలు నిర్వహించేందుకు డెడ్ బాడీని తీసుకెళ్తామని బాధితురాలి ఫ్యామిలీ జిల్లా మేజిస్ట్రేట్ కు విజ్ఞప్తి చేసింది. కానీ కుటుంబసభ్యులు లేకుండా పోలీసులే అంత్యక్రియలు చేశారు” అని ఎన్ సీడబ్ల్యూ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని యూపీ డీజీపీని ఆదేశించింది. వీలైనంత తొందరగా రిపోర్టు పంపించాలని కోరింది.

హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు: పోలీసులు
దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి . అసలు బాధితురాలిపై రేప్ జరగలేదని యూపీ పోలీసులు చెప్పారు. ‘‘బాధితురాలి బాడీపై వీర్యం ఆనవాళ్లులేవని ఫోరెన్సి క్ రిపోర్టులో వెల్లడైంది. ఆమెపై రేప్ జరగలేదని ఆ రిపోర్టు కన్ఫామ్ చేసింది” అని ఏడీజీ ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు.
కొంతమంది రేప్ జరిగిందని తప్పుడు ప్రచారంచేశారని, కుల గొడవలు సృష్టించేందుకే ఈ కుట్ర పన్నారని అర్థమవుతోందని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై బాధితురాలి బ్రదర్ సెప్టెంబర్
14న కంప్లయింట్ చేశాడని చెప్పారు.

For More News..

రాహుల్, ప్రియాంక ను వెనక్కి​ పంపేసిన్రు