IND vs AUS: భారత బౌలర్లను కమ్మేసిన మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఆసీస్ విజయం 

IND vs AUS: భారత బౌలర్లను కమ్మేసిన మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఆసీస్ విజయం 

గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో ఆసీస్ జట్టు ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్(104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. కంగారూల ఎదుట 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేసించినప్పటికీ.. భారత బౌలర్లు దానిని కాపాడలేకపోయారు. కొట్టుకోండి అన్నట్లుగా బంతులేస్తో విజయాన్ని అప్పగించారు.

మ్యాక్స్‌వెల్ వీరోచిత ఇన్నింగ్స్

భార‌త్ నిర్దేశించిన 223 ప‌రుగుల ఛేద‌న‌లో ఆసీస్ ఆఖ‌రి బంతికి విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దాన్ని కాపాడలేకపోయాడు. మ్యాక్స్‌వెల్‌ - మాథ్యూ వేడ్ జోడి చివరి ఆరు బంతులను  4, 1, 6, 4, 4, 4 మలిచి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. మ్యాక్స్‌వెల్‌(104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్‌, 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

 

తొలి రెండు టీ20ల్లోపర్వాలేధనిపించిన భారత యువ బౌలర్లు.. మూడో టీ20లో మాత్రం తేలిపోయారు. అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ , అక్ష‌ర్ ప‌టేల్ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుని భార‌త విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీశారు. రవి బిష్ణోయ్(4 ఓవర్లలో 32 పరుగులు, 2 వికెట్లు) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

రుతురాజ్ మెరుపు సెంచరీ

అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్(123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) శత‌కం బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్(123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు), తిలక్ వర్మ(31 నాటౌట్; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. 

ఈ గెలుపుతో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఈ  ఇరు జట్ల మధ్య శుక్రవారం(డిసెంబర్ 1) రాయ్‌పూర్ వేదికగా నాలుగో టీ20 జరగనుంది.