మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మొదలైన కౌంటింగ్

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మొదలైన కౌంటింగ్

ముంబై: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలైంది. మహా పీఠాన్ని అధిరోహించేది మాహాయుతి సర్కారా? లేదా మహా వికాస్​ అగాఢీ (ఎంవీఏ)నా? అనే ఉత్కంఠ వీడనుంది. శనివారం సాయంత్రంలోగా ఫలితాలు వెలవడనుండగా.. సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్​ నెలకొన్నది. ఎన్నికల ముందు నుంచి రెండు కూటములు కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక.. జార్ఖండ్​అసెంబ్లీ ఎన్నికల ఫలితం కూడా నేడే తేలనున్నది. జేఎఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం దక్కించుకుంటుందా? లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఈసారి కొలువుదీరుతుందా? అనే ఉత్కంఠ వీడనుంది.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగా 65 శాతం పోలింగ్​ నమోదైంది. జార్ఖండ్లో నవంబర్​13, 20న రెండు దశల్లో పోలింగ్​జరిగింది. మొదటి దశలో 43 నియోజకవర్గాల్లో 81 సీట్లకు, రెండో దశలో 38 సీట్లకు ఓటింగ్​ జరిగింది. ఈసారి జార్ఖండ్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక పోలింగ్​ (67.74%) నమోదైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడ్డాయి.