ఏపీలో బోణీ కొట్టిన టీడీపీ 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్తానాల్లో 161 సీట్లలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.  ఈ ఫలితాల్లో కూటమి నుంచి టీడీపీ బోణి కొట్టింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గొరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణపై 50 వేలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఫలితాల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలంలో 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.